వాంఖడే స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ విధ్యంసకర ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్‌ను చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ను బౌలర్లు కట్టడి చేయగా… ఛేజింగ్‌లోనూ రాణించింది. దీంతో సన్‌రైజర్స్ నిర్ధేశించిన 174 పరుగుల టార్గెట్‌ను 17.2 ఓవర్లలోనే ముగించింది 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఛేజింగ్‌లో 31 పరుగులకే మూడు వికెట్లు పడిన దశలో తిలక్ వర్మ(37 నాటౌట్)తో కలిసి సూర్యకుమార్ యాదవ్ భారీ పార్ట్నర్షిప్ నిర్మించాడు. 30 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన సూర్య.. 51 బంతుల్లో 102 (నాటౌట్) పరుగులతో సెంచరీతో చెలరేగి..ముంబై జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. ఇక ఈ విజయంతో 10వ స్థానంలో ఉన్న ముంబై.. 9వ స్థానానికి చేరుకుంది. ప్లే ఆఫ్స్ బెర్త్‌పై ఆశలు గల్లంతైనా…. పరువు కోసం ఆడుతున్న ముంబై ఇండియన్స్ జట్టుకు సూర్య, తిలక్ వర్మలు గెలుపును గిఫ్ట్‌గా అందించారు.