భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న ఆఖరి టీ20లో భారత్ భారీ స్కోరు నమోదు చేసింది. సఫారీ బౌలర్లను ఉతికి ఆరేస్తూ టీమిండియా ఓపెనర్లు విజృంభించారు. దీంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. సిరీస్‌లో ఆఖరి నిర్ణయాత్మక మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
కాగా, ఈ సిరీస్‌లోని సెంచరీ హీరోలు సంజూ శాంసన్ (56 బంతుల్లో 9 సిక్సర్లు, 6 ఫోర్లు 109 నాటౌట్ ), తిలక్ వర్మ ( 47 బంతుల్లో 10 సిక్స్, 9 ఫోర్లు 120 నాటౌట్ ) ఈ మ్యాచ్‌లో తలో సెంచరీతో చెలరేగిపోయారు. సిక్సులు, ఫోర్లతో బౌండరీల మోత మోగిస్తూ… దక్షిణాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించారు. వీరిద్దరు భాగస్వామ్యంలో 210 పరుగులు చేశారు. ఇక అంతకుముందు అభిషేక్ శర్మ (36) రాణించాడు.
సౌఫ్రికా బౌలర్లలో లూథో సిపమ్లా ఒక్క వికెట్ తీసాడు. కాగా, ఆతిథ్య సౌతాఫ్రికా జట్టు ముందు 284 పరుగుల టార్గెట్ తో చేజింగ్ ప్రారంభించనుంది.