Thursday, October 3, 2024

KNL: ఆలూరు, దేవనకొండలో ఎమ్మెల్యే అనుచరుల విధ్వంసం..

రెండు పవర్ విద్యుత్ స్టేషన్లపై దాడి
కార్యాలయ ఫర్నిచర్, కంప్యూటర్ల ధ్వంసం
అడ్డు వచ్చిన అధికార, సిబ్బందిని చితక బాదిన వైనం
ఎమ్మెల్యేను కలవనందుకు దాడి చేసినట్లు ప్రచారం
దేవనకొండలో 24మంది ఎమ్మెల్యే అనుచరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఆలూరుకు తరలింపు


కర్నూలు బ్యూరో : ఆలూరులో వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షి సోదరుడు, ఆయన అనుచరులతో కలిసి ఆలూరులో రెచ్చిపోయారు. మొలగవల్లి గ్రామం జోహారపురం సమీపంలో విండ్ పవర్ సబ్ స్టేషన్ పై ఎమ్మెల్యే విరూపాక్షి అనుచరులు దాడికి తెగబడ్డారు. అడ్డువచ్చిన పవర్ స్టేషన్ అధికారులను చితకబాదారు.

కంప్యూటర్లు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. వచ్చి కలవమంటే ఎమ్మెల్యేకి ఎదురు సమాధానాలు చెబుతారా.. ప్రాణాలు తీస్తామంటూ సిబ్బందిని బెదిరించారు. విండ్ పవర్ వ్యవహారంలో ఎమ్మెల్యే విరూపాక్షి, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు నారాయణల మధ్య వివాదం కొనసాగుతున్నట్లు సమాచారం.

- Advertisement -

దీంతో స్థానిక ఎమ్మెల్యేని కలవకుండా విధులు నిర్వహిస్తారా అంటూ అధికార, సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేశారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే పిలిచినా కలవరా.. అంటూ కార్యాలయంలోని ఫర్నిచర్ ధ్వంసం చేశారని విద్యుత్ సంస్థ ఉద్యోగులు ఆరోపించారు.

అంతకుముందు దేవనకొండ మండలంలోని విండ్ పవర్ స్టేషన్ పై కూడా ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు. విషయం తెలియగానే పోలీసులు ఘటన స్థలికి చేరుకొని దాదాపు 24 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు వారి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దాడికి పాల్పడిన నిందితులను ఆలూరుకు తరలించారు. దేవనకొండ మండలం జిల్లె బుడకల గ్రామంలోని విండి పవర్ స్టేషన్ పై కూడా దాడికి దిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement