మహిళల ఆసియాకప్‌లో భాగంగా ఈరోజు జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా…. లీగ్ చరిత్రలో తొలిసారి 200 పరుగులు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక అనంతరం భారీ స్కోరుతో ఛేదనకు దిగిన యువ యూఏఈ… నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 123 పరుగులకే పరిమితమైంది.
దీంతో ఈ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 78 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇక వరుసగా రెండు విజయాలతో భారత మహిళల జట్టు గ్రూప్ ఏ పాయింట్ల పట్టికలో నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.
యూఏఈ బ్యాటర్లలో ఈషా రోహిత్ (38) పరుగులు చేయగా.. కవిషా ఎగోడాగే (40) నాటౌట్‌గా నిలిచింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ రెండు వికెట్ల పడగొట్టగా… రేణుకా సింగ్ ఠాకూర్, తనూజా కన్వర్, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ బాదింది. ఓపెనర్ షిఫాలీ వర్మ (37) పరుగులతో పరువాలేదనిపించగా….. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (66) అర్ధ శతకంతో చెలరేగింది. ఇక వికెట్ కీపర్ రీచా ఘోష్ (64 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించింది. దాంతో, టీమిండియా టీ20ల్లో తొలిసారి అత్యధిక స్కోర్‌తో చరిత్ర సృష్టించింది.