Tuesday, November 26, 2024

శిల్పకళపై గుప్తనిధుల కత్తి.. శిల్పుల కష్టం శిథిలం..

అనంతపురం జిల్లాలో పురాతన దేవాలయాలలోనే ఒకటైన లేపాక్షి దేవాలయంలో ఏడు ప్రాకారాల భాగంలో వున్న అప్పటి రాజుల చేత నిర్మించబడిన కోదండ రామదేవాలయం కుడివైపునా వున్న నాలుగు సింహాలు గర్జించే గోపురం పురాతనమైనది. ఇక్కడ పూర్వీకులు కోదండరామస్వామి కల్యాణాన్ని అప్పటి పాలకులు ఘనంగా నిర్వహించే వారని తెలుస్తోంది. అయితే ఆ దేవాలయం పరిధిలోని గోపురంపై గుప్తనిధుల వేటు పడిందా.. అక్కడ గోపురమే కూలిందా.. అనే విషయంపై ప్రజలు బహిరంగంగా చర్చించుకోవడం విశేషం.

వీటిపై పర్యవేక్షిం చాల్సిన అధికారులు పర్యవేక్షణ లేక విఫలమతున్నారనే విమర్శలు గట్టిగా వినబతున్నాయి. ఇప్పటికే దక్షిణ భారత దేశంలో చరిత్ర కలిగిన దేవాలయం నిర్మించిన కాలం నుండి నేటికి నాలుగు ప్రాకారాలు కాలగర్భంలో కలిస్తే కాపాలా కాయాల్సిన దేవాలయంపై పెత్తనం చెలాయించే పెద్ద మనుషులు, అధికారులు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. అతి పెద్ద పురాతన దేవాలయమైన లేపాక్షిలో దేవాలయాలు భద్రత పూర్తిగా కరువైందని ఆలయం చుట్టు ఇప్పుడు కూడా కంచుకోట లాంటి కట్టడాలు కూలుతున్నాయా లేక కూలుస్తున్నారనే సాక్ష్యాలు కళ్లుకు కట్టినట్టు తెలుస్తోంది. దేశవిదేశాలకే తెలిసిన లేపాక్షి శిల్పకళను ఇలాంటి సంఘటనలు జరిగితే భవిష్యత్లో దేవాలయం ఉనికి దెబ్బతినే అవకాశం వుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దేవాలయం పరిసరాలను పురాతన ఆనవాళ్లును పరిశీలించి భద్రత కల్పించాలని , దేవాలయాలపై గుప్తనిదులకు పాల్పడిన వారిపై ప్రత్యేక నిఘా వుంచి కఠిన చర్యలు తీసుకుంటే లేపాక్షి శిల్పకళను కాపాడిన వారమవుతారు లేకపోతే చరిత్ర హీనులుగా మిగులుతారు .

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement