మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు కుమారుడు, హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠీల పెళ్లి ఇటలీలో నవంబర్ ఒకటో తేదిన జరగనుంది. ఇటలీలో జరిగే ఈ వివాహానికి హాజరవడానికి పవన్ కల్యాణ్ సతీసమేతంగా ఇటలీకి బయల్దేరారు. వాస్తవానికి ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉన్న పవన్ ఇటలీకి వెళ్తారా? లేదా? అనే విషయంలో కొంత సందేహం ఉండేది. అయితే ఈ సందేహాలకు ముగింపు పలుకుతూ పవన్ తన భార్యతో కలిసి ఎయిర్ పోర్టులో ప్రత్యక్షమయ్యారు. మరోవైపు ఇప్పటికే కొందరు మెగా కుటుంబ సభ్యులు ఇటలీకి చేరుకున్నారు. ఈరోజు, రేపటి లోగా మిగిలిన వారందరూ చేరుకోబోతున్నారు.
- Advertisement -