Monday, November 18, 2024

Chandigarh: డేరా బాబా నిర్దోషి.. 2002 నాటి హ‌త్య‌ కేసు

బాబాకు యావ‌జ్జీవ ఖైదు విధించిన సిబిఐ
హైకోర్టులో అప్పిల్ చేసిన గుర్మిత్ సింగ్
22 ఏళ్ల త‌ర్వాత సంచలన తీర్పు

చంఢీగఢ్‌: గుర్మీత్‌ రాం రహీం సింగ్‌(డేరా బాబా)కు భారీ ఊరట లభించింది. 2002లో జరిగిన డేరా సచ్చా సౌదా మాజీ అధికారి రంజిత్‌ సింగ్‌ హత్య కేసులో పంజాబ్‌, హర్యానా హైకోర్టు డేరా బాబాను మంగళవారం నిర్దోషిగా ప్రకంటించింది. ఈ హత్యకేసులో డేరా బాబాతో పాటు.. జస్బీర్ సింగ్, సబ్దిల్ సింగ్, క్రిషన్ లాల్, అవతార్ సింగ్‌లకు సీబీఐ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం విధించిన శిక్షను డేరా బాబా హైకోర్టులో సవాల్‌ చేశారు. ఇవాళ హైకోర్టు ఇ​చ్చిన తీర్పుతో రంజిత్‌ సింగ్‌ హత్య కేసులో డేరా బాబా 21 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత నిర్దోషిగా తేలారు.

హర్యానాలోని సిర్సాలో ఉన్న డేరా సచ్చా సౌదా ఆశ్రమం మాజీ అధికారి రంజిత్‌ సింగ్‌. ఆయన జూలై 10, 2002న​ హత్యకు గురయ్యారు. ఈ హత్యపై కురుక్షేత్రలోని తానేసర్ పోలీసు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 2003లో ఈ హత్యకేసును విచారణ దర్యాప్తు చేయాలని చంఢీగఢ్‌ హైకోర్టు సీబీఐ ఆదేశించింది. ఈ కేసులు డేరా బాబాతో పాటు మరో నలుగురిపై చార్జ్‌షీట్‌ దాఖలు చేసి విచారణ చేపట్టింది. అనంతరం డేరా బాబాతో మరో నలుగురికి సీబీఐ ప్రత్యేక కో​ర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. తాజా తీర్పుతో డేరా బాబాకు ఊర‌ట ల‌భించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement