ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ : మహారాష్ట్ర సచివాలయం పైనుంచి అధికార కూటమి శాసనసభ్యుడు దూకడం కలకలం రేపింది. అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ శాసనసభ్యుడు, డిప్యూటీ స్పీకర్ ముంబయిలోని సెక్రటేరియట్ భవనం మూడో అంతస్తు నుంచి కిందకు దూకారు.
అయితే, ఇలాంటి ఘటనలు అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన సేఫ్టీ నెట్లో పడి, అక్కడే చిక్కుకుపోయారు. ఆయన్ను పోలీసులు సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు. గిరిజనుల రిజర్వేషన్ కోటాను నీరుగార్చడంపై నిరసన తెలిపేందుకు ఇలా చేశానని నరహరి చెప్పారు.