Wednesday, December 18, 2024

Canada ఉప ప్రధాని రాజీనామా

కెనడా ప్రభుత్వం ప్రస్తుతం తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రధాని ట్రుడోకు మ‌రో బిగ్ షాక్ తగిలింది. ఆ దేశ ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్‌ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జస్టిన్ ట్రూడో మంత్రివర్గంలో అత్యంత శక్తిమంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందిన ఆమె రాజీనామా చేయడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.

అయితే ప్రధాని ట్రూడో ప్రజాదరణ కోల్పోవడమే రాజీనామాకు కారణమని ఆమే అన్నారు. తనకు, ట్రూడోకు అభిప్రాయ భేదాలు ఉన్నాయని ఫ్రీలాండ్ చెప్పారు. కాగా, తాను లిబరల్ పార్టీ సభ్యురాలిగానే కొనసాగుతానని, వచ్చే ఎన్నికల్లో టొరంటో నుంచి మళ్లీ పోటీ చేస్తానని చెప్పారు.

2013లో తొలిసారిగా పార్లమెంటుకు ఎన్నికైన క్రిస్టియా.. ఆ తర్వాత ట్రూడో మంత్రివర్గంలో చేరారు. వాణిజ్యం, విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. ఫ్రీలాండ్ ఆగస్ట్ 2020 నుండి ఆర్థిక మంత్రిగా కొనసాగారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement