ఆంధ్ర ప్రధేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని తన నివాసాన్ని క్యాంపు కార్యాలయంగా ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇవాళ ఆయన సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. విజయవాడలో ఎంతో విశాలమైన క్యాంపు కార్యాలయాన్ని తనకు కేటాయించడం పట్ల చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
అయితే, మంగళగిరిలోని తన నివాసాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించుకోనున్న క్రమంలో.. విజయవాడలో తనకు కేటాయించిన క్యాంపు కార్యాలయాన్ని ప్రభుత్వానికి తిరిగి అప్పగిస్తున్నట్లు జనసేనాని వివరించారు.