Tuesday, October 22, 2024

TG | సుంకిశాల ప్రాజెక్టు విషయంలో కేటీఆర్ కు డిప్యూటీ సీఎం కౌంటర్..!

సుంకిశాల ప్రాజెక్టు విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ‌ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. సుంకిశాలకు సంబంధించిన ఘటనలో పొరపాటును ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పై ఎదురుదాడి చేయడం సరికాదన్నారు.

సుంకిశాల ఘటనతో కృష్ణా నదిపై బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల నాణ్యతపై చేయిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే కాలేశ్వరం సుంకిశాల ప్రాజెక్టులను నిర్మించారు. నీళ్లు రాకుండానే కాలేశ్వరం కృంగిపోయింది. నీళ్లు వచ్చిన తర్వాత సుంకిశాల ప్రాజెక్టు మునిగింద‌ని భట్టి విక్రమార్క ఆరోపించారు.

మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు అక్కడ కట్టడం సరికాదని కాంగ్రెస్ ముందే చెప్పిన వినకుండా.. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిందని.. ఫలితం ఏంటో ఇప్పుడు అందరం చూస్తున్నామ‌న్నారు. ఇంజనీర్లు చెప్పింది కాదని కేసీఆర్ సొంత నిర్ణయాలు తీసుకొని కాలేశ్వరం కట్టడం వల్లే కుంగుబాటుకు కారణమైంది అని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొదలు పెట్టిన ప్రాజెక్టులకు రీడిజైన్ చేసి ఇరిగేషన్ శాఖను బీఆర్ఎస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని తెలిపారు. సీతారామ ప్రాజెక్టుపై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఎకరానికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు ఇవ్వలేదని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీతారామ ప్రాజెక్టు పై పెట్టిన ఖర్చు వృధా కాకుండా ఉండడానికి.. ముఖ్యమంత్రి భద్రాచలం పర్యటనకు వచ్చినప్పుడు ఇంజనీర్లతో కలిసి రాజీవ్ గాంధీ లింకు కెనాల్ ను ప్రతిపాదించామన్నారు. కేవలం 75 కోట్ల రూపాయలతో రాజీవ్ లింకు కెనాల్ ను మూడు నెలల్లో పూర్తి చేసి ఒక లక్ష 50 వేల ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమం చేపట్టామని భట్టి విక్రమార్క తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement