మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో జార్ఖండ్, మహారాష్ట్ర కౌంటింగ్‌కు కాంగ్రెస్ పార్టీ పరిశీలకులను నియమించింది. మహారాష్ట్రకు ముగ్గురిని, జార్ఖండ్‌కు ముగ్గురు నేతలను నియమిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటనను విడుదల చేశారు.
తెలంగాణకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు జార్ఖండ్ అబ్జర్వర్‌గా చోటు లభించింది. అలాగే జార్ఖండ్‌కు తారిఖ్ అన్వర్, కృష్ణ అల్లవూరును కూడా నియమించారు. మహారాష్ట్రకు అబ్జర్వర్లుగా సీనియర్ నేతలు అశోక్ గెహ్లాట్, భూపేష్ భఘేల్, జీ పరమేశ్వరను ఏఐసీసీ నియమించింది.