Monday, November 18, 2024

40 మంది రష్యా దౌత్యవేత్తల బహిష్కరణ: జర్మనీ

బెర్లిన్‌: ఉక్రెయిన్‌లో రష్యా హింసాకాండను నమ్మశక్యం కానీ క్రూరత్వంగా జర్మనీ అభివర్ణించింది. ఈ చర్యకు నిరసనగా, 40 మంది రష్యా దౌత్య సిబ్బందిని బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే జర్మనీ చర్యను రష్యా తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది ఇరుదేశాల మధ్య సంబంధాలను దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించింది. ‘జర్మనీలో వివిధ విభాగాల్లో ఉన్న రష్యా దౌత్యవేత్తలను బహిష్కరించడం వల్ల మన ద్వైపాక్షిక సంబంధాల్లో అంతరాయం ఏర్పడుతుంది.

ఇది ఇరు దేశాల సంబంధాల్లో క్షీణతకు దారితీస్తుంది. బుచా ఘటనలపై స్వతంత్ర దర్యాప్తు జరిగేవరకు ఆగకుండా జర్మనీ కీవ్‌కు మద్దతుగా నిల్చుంది. ఈ క్రమంలో బెర్లిన్‌ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని తోసిపుచ్చుతున్నాం’ అని జర్మనీలోని రష్యా రాయబార కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. 40 మంది దౌత్య సిబ్బందిని దేశం విడిచి వెళ్లిపోవాలని జర్మనీ చెప్పినట్లు ధ్రువీకరించింది. ఫ్రాన్స్‌, లిథువేనియా కూడా ఈ తరహా చర్యలే తీసుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement