Tuesday, November 26, 2024

NZB | జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న డెంగ్యూ కేసులు..

నిజామాబాద్ ప్రతినిధి, (ప్రభ న్యూస్) : జిల్లాపై విష జ్వరాల పంజా విసిరింది. రోజు రోజుకి డెంగ్యూ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఈ సీజన్లో అత్య ధికంగా 232 డెంగీ కేసులు నమోద య్యా యి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. విష జ్వరాలు ప్రబ లిస్తున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసు పత్రిలో శుక్రవారం ఒకేరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2,680 మంది ఓపి రికార్డు స్థాయిలో నమోదయింది.

ఇక‌ ఉస్మానియా ఆసుపత్రిలో 2566 మంది ఓపీ నమోదు కాగా, గాంధీ ఆస్పత్రిలో 2192 మంది ఓపీ, వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రిలో 2385 మంది ఓపీ నమోదయింది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాసుపత్రిలో ఒకే రోజు నమోదైన ఓపి సేవలో నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అత్యధికంగా మొదటి స్థానంలో ఓపీ నమోదు కావడం గమనార్హం.

అంతేకాకుండా, అత్యధికంగా నిజామాబాద్‌లో ఆగస్టులో అత్యధికంగా 302 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. గురువారం రోజు కూడా 13 డెంగీ కేసులు నమోదయ్యాయి. దీంతో చిన్నపాటి జ్వరమేఅని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న దృష్ట్యా ఎప్పటికప్పుడు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement