హైదరాబాద్ నగరంలోని అక్రమ కట్టడాలపై జీహెచ్‌ఎంసీ అధికారులు దృష్టి సారించారు. నిబంధనలకు విరుద్ధంగా కట్టిన నిర్మాణాలను కూల్చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే.. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో ఉన్న ఏపీ మాజీ సీఎం, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం ముందు ఉన్న అక్రమ కట్టడాలను అధికారులు కూల్చేశారు.
వైఎస్ జగన్ ఇంటి ముందున్న నిర్మాణాల కూల్చివేతపై ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ బోర్కాడే హేమంత్ సహదేవరావుపై ఆమ్రపాలి చర్యలు తీసుకున్నారు. హేమంత్ బోర్కడేను బదిలీ చేసి, జీఐడీకి రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌ను విధుల నుంచి తొలగిస్తూ కమిషనర్ ఆమ్రపాలి ఉత్తర్వులు జారీ చేశారు.
లోటస్ పాండ్‌లోని వైఎస్ జగన్ నివాసం ముందు రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లుగా జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు అందాయి. ఫుట్‍పాత్ ఆక్రమించి జగన్ ఇంటి ముందు సెక్యూరిటీ పోస్ట్‌ల నిర్మాణం చేపట్టినట్లు స్థానికులు జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. పోలీసుల ఆధ్వరంలో రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలు కూల్చేశారు. జేసీబీలతో సెక్యూరిటీ పోస్టులను పూర్తిగా నెలమట్టం చేశారు.