మనదేశంలో ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరుగుతుంటాయి. అవి లోకసభ ఎన్నికలు కావచ్చు.. లేదా శాసనసభ ఎన్నికలు కావచ్చు.. లేదా కార్పొరేషన్ లేదా మున్సిపాలి టీ, గ్రామ పంచా
యతీ ఎన్నికలు కావచ్చు. ఏఎన్నికలు చూసినా ఏముంది గర్వ
కారణం అని పెదవి విరవాల్సిన పరిస్థితులు కనబడుతున్నా
యి. ఈ ఎన్నికల వల్ల సామాన్యుడికి ఒరిగేదేమీ లేదు. మన
రాజ్యాంగం మాత్రం ఎన్నికల్లో పోటీ చేయడానికి ధనిక, పేద
లాంటి తారతమ్యాలు లేకుండా ఎవరైనా పోటీ చేయడానికి హక్కు కల్పించింది. అయితే సామాన్యుడు లేదా మధ్య తరగతి వారు ఎన్నికల్లో పోటీచేసే పరిస్థితి మాత్రం లేనే లేదు. ఎన్నికలంటే మంది మార్బలం, డబ్బు, మద్యం సమ కూర్చగలిగే పరిస్థితి ఉంటేనే ఎన్నికల్లో పోటీ చేయవచ్చు అనే పరిస్థితి వచ్చింది. అవి లేవంటే ఆ అభ్యర్ధిని పట్టించుకోనే నాధుడే ఉండడు. చిన్నపాటి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే లక్షల్లో డబ్బు వెచ్చించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణ లో దుబ్బాక ఉప ఎన్నిక, తర్వాత హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికలు.. ప్రస్తుతం ఎమ్మెల్సీఎన్నికలు.. వచ్చే నెలలో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక జరగనుంది. ఇక ఆంధ్ర విషయానికి వస్తే కార్పొరేషన్తో పాటు మున్సిపల్ ఎన్నికలు ముగిసి ప్రస్తుతం రాజకీయ నాయకులు సేద తీరుతున్నారు. త్వరలోనే తిరుపతి ఉప ఎన్నిక, జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతు న్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే ఈ నెలఖారు నుంచి దేశంలోని ఐదు రాష్ట్రాల్లోని శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక మినీ
సంగ్రామాన్ని తలపిస్తోంది. ఎందుకంటే ప్రధానమంత్రి నుంచి కేంద్ర
మంత్రుల వరకూ ప్రచారంలో పాల్గొంటారు కాబట్టి.. జాతీయ మీడియా మొత్తం వారిపై ఫోకస్ పెడుతుంది. ఇవన్నీ ఒక ఎత్తయితే ప్రస్తుతం ఎన్నికల్లో నిజాయితీగా రూపాయి ఖర్చు పెట్టకుండా నెగ్గేపరిస్థితి ఉందా అంటే.. ఖచ్చితంగా లేదనే చెప్పాలి. డబ్బు మంచినీళ్లలా ఖర్చు చేయకపోతే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు. డబ్బు లేదంటే రాజకీయ పార్టీలు టిక్కెట్లు కూడా ఇవ్వవు. ప్రస్తుతం ఎన్నికలు ఖచ్చితంగా ఖరీదైన వ్యవహా రంగా మారిపోయాయి. ఎన్నికల్లో పోటీ చేయాలంటే కోట్లాది రూపాయలున్న వారు మాత్రమే పోటీ చేయగలరనే పరిస్థితి ఉంది. ఇంత భారీ ఖరీ దైన ఎన్నికల తర్వాత ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం మనగలుగుతుందా? అనే ప్రశ్న తలెత్తకమానదు. 2014 ఎన్నికల్లో రూ.300 కోట్ల నగదు,కొన్ని వందల కిలోల మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. అంటే రాజకీయ పార్టీలు ఓటర్లకు డబ్బు ఎర వేసి ఓట్లను దండుకుంటున్నారని అర్ధం. డబ్బు లేనిదే.. రాజకీయం లేదనేది మాత్రం కాదనలేని వాస్తవం. ఇటీవల జాతీయ మీడియాలో వచ్చిన రెండు వార్తలు దేశంలో పరిస్థి తులకు అద్దం పడతాయి. కోవిడ్ -19 వల్ల ఢిల్లీలో నివసించే వారి ఆదాయం సరాసరి రూ.20వేల వరకు తగ్గిపోయిందనేది ప్రధాన వార్త. ఢిల్లీలోనే పరిస్థితి ఇలా ఉంటే దేశంలోని ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఇట్టే ఊహించుకోవచ్చు. మరో రిపోర్టు ఏమిటంటే ఈశాన్య ప్రాంతంలోని అస్సాం గురించి ప్రస్తావించారు. ఎన్నికలు ప్రకటించిన కొద్ది రోజులలోనే 18 కోట్ల నగదు,మద్యం, డ్రగ్స్ తో పాటు నిషేధిత మత్తు పదార్థాలు పట్టుబడ్డాయనేది కథనం. దీన్ని బట్టి చూస్తే.. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజా స్వామ్య దేశమైన భారత్ లో కరోనా వల్ల ప్రజలు మరింత కడు పేదరికం లోకి జారిపోయారు. దీనికి వ్యతిరేకంగా మన రాజకీయనాయకులసంపద చెక్కుచెదరలేదనేది మాత్రం వాస్తవం. మరోపక్క దేశంలో ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ ఎలా ఉందో కూడా తాజా పరిణామాలు తెలుపుతున్నాయి.
ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికల్లో గెలవాల్సిన అభ్యర్థి.. ఓటర్లను ఆక
ర్షించేందుకు డబ్బు, మద్యం ఎర వేస్తున్నాడు. ఎన్నికల్లో గెలవాలంటే
డబ్బు, మద్యం తప్పనిసరి అని ఉత్తరాదికి చెందిన ఎమ్మెల్యేలు ఢిల్లీలో బాహాటంగా చెబుతుంటారు. ఎన్నికల తర్వాత వారు (ఓటర్లు) తమ ప్రాంతంలో రోడ్డు, స్కూళ్లు, ఆస్పత్రులు నిర్మించాలని తమపై ఒత్తిడి తేరని… ఉద్యోగాలు, కాంట్రాక్టులు, లేదా నామినేటెడ్ పోస్టుల్లో తమకు స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తుంటారని ఆ ఎమ్మెల్యేలు చెప్పారు. ఎన్నికైన ఎమ్మెల్యే విషయానికి వస్తే .. వచ్చే ఎలక్షన్ కోసం ఇప్పటి నుంచే డబ్బు, మద్యాన్ని సేకరించి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడు తోంది.
దీంతో పాటు కండలు తిరిగిన బాడీగార్డులు తప్పనిసరి. పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరికి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో ఎంత పెద్ద మొత్తంలో డబ్బు, మద్యం పట్టు పడుతుందోో చెప్పడం చిక్కడం లేదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ 2014,
2019 లోకసభకు జరిగిన ఎన్నికల్లో అక్రమంగా తరలించిన సొమ్ము
లెక్క చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. 2014 లోకసభ ఎన్నికల్లో దేశ
వ్యాప్తంగా రూ.300 కోట్ల వరకు డబ్బు … వందల కిలోలమాదక ద్రవ్యా
లు పట్టుబడ్డాయి. ఈ కేసులకు సంబంధించి 11 లక్షల మంది ప్రజలపై
చర్యలు తీసుకున్నారు. అటు తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో రూ.844
కోట్ల నగదు, రూ.300 కోట్ల మద్యం, రూ.1,200 కోట్ల మాదకద్రవ్యాలు,
రూ. 1,000 కోట్ల విలువ చేసే నగలు స్వాధీనం అయ్యాయి. ఈ ఐదేళ్లలో
పరిస్థితి ఎంత దిగజారిపోయిందో దీన్ని బట్టి చూస్తే ఇట్టే తెలిసిపోతోంది.
మన రాజకీయ నాయకులు డబ్బు, మద్యం ఎంత విచ్చలవిడిగా ఖర్చు
పెడుతున్నారు అర్థం అవుతోంది.
మన నేతలంతా కోటీశ్వరులే.. : ది అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్
రీఫామ్స్ (ఏడీఆర్) అనే సంస్థ589 లోక్ సభ సభ్యులపై దర్యాప్త జరిపింది.
వారిలో 475 మంది కోటీశ్వరులు. 266 మంది సభ్యుల ఆస్తులు రూ.5
కోట్ల కంటే ఎక్కువ. (ఇవి అధికారికంగా చూపించినవి). దేశంలో క్రమం
గా సంపన్నులవుతున్న ఎంపీల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది.
ఉదాహరణకు 2009 లోకసభ ఎన్నికల్లో 58 శాతం మంది కోటీశ్వర్లుంటే 2014 నాటికి వీరి సంఖ్య ఏకంగా 82 శాతానికి పెరిగిపోయింది. ప్రస్తుతం మన లోకసభతో పాటు రాజ్యసభలో ఉన్న ఎంపీలంతా కోటీశ్వరులే.నేరాల చరిత్రలోనూ ఘనులే… : మన ఎంపీలు సంపన్నులతోనే సరిపోవడం లేదు. గత ఏడాది బీహార్ శాసనసభకు ఎన్నికైన అభ్యర్థుల్లో 51 శాతం మందికి నేరచరిత్ర కలిగి ఉన్నారు. అంతకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వీరి సంఖ్య 40శాతంగా ఉండేది. గత ఏడాది నవంబర్ లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికైన వారిలో 163 మంది నేర చరిత్ర కలిగిన వారున్నారు. వారిలో కొంతమందిపై అత్యాచారాలు, హత్యలు, కిడ్నాప్, మహిళలపై నేరాలు చేసిన ఘన చరిత్ర కలిగిన వారున్నారని ఏడీఆర్పేర్కొంది. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే లాలూప్రసాద్ యాదవ్ పార్టీకి చెందిన వారిలో 73 శాతం మందికి నేరచరిత్ర కలిగిన వారుంటే.. బీజేపీ అభ్యర్థుల్లో 64 శాతం మంది వరకు నేరచరిత్ర కలిగి నవారున్నారు. ఈ సందర్భంగా రామ్ మనోహర్లో హియా గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పేదల పెన్నిది అయిన రామ్ మనోహర్ లోహియా ఏక్ నోట్, ఏక్ వోటు అనే నినాదం బాగా ప్రాచుర్యం పొందింది.
రామ్ మనోహర్ లోహియా ఎన్నికల బహిరంగసభలో తన పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఒక సంచి ఇచ్చి సమావేశంలో పాల్గొన్న వారి దగ్గరికి పంపేవారు.
సభకు వచ్చిన వారిని తమ అభ్యర్థులకు ఒక రూపాయి విరాళంగా ఇవ్వాలని విజప్తి చేసేవారు. ప్రజలు కూడా తమవద్ద ఉన్న రూపాయిని స్వచ్చందం గా ఇచ్చేవారు. ఆయన నిలబెట్టిన అభ్యర్థులు ఎన్నికల్లో గెలిచి… అటు తర్వాత ఆయన శిష్యులు రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదిగారు. లోహియా సిద్ధాంతాలను మన రాజకీయ పార్టీలు అమలు చేస్తే.. మెరుగిన ప్రజాస్వామ్య పరిఢవిల్లుతుంది. దేశవ్యాప్తంగా కోవితో దేశంలోని ప్రజ లు పేదరికంలోకి మగ్గిపోతే.. నేతల సంపద మాత్రం క్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి తారతమ్యం మంచిదికాదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఖరీదైన వ్యవహారంగా మాత్రం ఉండరాదు. ప్రస్తుత పరిస్థితుల్లో బాగా డబ్బున్న వారు మాత్రమే పోటీ చేసి అధికారం హస్తగతం చేసుకోగలుగుతున్నారు. ఇంత ఖరీదైన ఎన్నికలు మన ప్రజాస్వామ్యానికి పనికిరావు. ప్రస్తుతం మన రాజకీయ వ్యవుస్థలో జరుగుతున్న పరిణామాలు ప్రజాస్వామ్యానికి మేలు చేకూర్చేలాలేవు.గత ఐదు దశాబ్దాల నుంచి చూస్తే రాజకీయాలు డబ్బుచుట్టే తిరుగుతున్నాయి. దీనికి మన ఓటర్లను కూడా తప్పుపట్టాల్సిం దే. రాజకీయనాయకుడు ఇచ్చే డబ్బుకు ఆశపడి ఓటును అమ్ముకోవడం దౌర్భాగ్యం.
మన ప్రజాస్వామ్యానికి ఇది హర్తి విరుద్ధం. మన ప్రజలు… ఎన్ను కోబడ్డ నాయకులు దీనిపై ఆత్యపరిశీలన చేసుకొంటే మంచిది. లేదం టే రాబోయి రోజుల్లో పరిస్థితులు మరింత దారుణంగా తయారు కావడం ఖాయం. మేలుకో ఓట రా..
మేలుకో…