Friday, November 22, 2024

లగ్జరీ విల్లాలకు భలే డిమాండ్‌.. ముంబై, తెలంగాణలో మూడింతలు

మెరుగైన డిమాండ్‌, సరఫరా కారణంగా ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్‌లో లగ్జరీ విల్లాల విక్రయాలు రెట్టింపయ్యాయి. రూ. 1.5 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న గృహాల విక్రయాలు 13,630 యూనిట్లకు చేరాయి. అంటే దాదాపు రెండు రెట్లు పెరిగాయి. గతేడాది ఇదే కాలంలో 6,210 లగ్జరీ గృహాలు విక్రయించినట్లు రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ అనరాక్‌ డేటా వెల్లడించింది. అనరాక్‌ ట్రాక్‌ చేసిన ఏడు ప్రధాన నగరాల్లో ట్రెండ్‌ ఎక్కువ లేదా తక్కువ సారూప్యంగా ఉంది.

- Advertisement -

లగ్జరీ రెసిడెన్షియల్‌ ప్రాపర్టీల విక్రయాలు గత ఏడాది ఇదే కాలంలో 39,300 యూనిట్ల నుంచి ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్‌ మధ్య ఏడు ప్రధాన నగరాల్లో 84,400 యూనిట్లకు పైగా పెరిగాయి. కోవిడ్‌ మహమ్మారి తర్వాత డిమాండ్‌ పెరగడంతో లగ్జరీహౌసింగ్‌ విభాగం వేగంగా వృద్ధి చెందుతోందని అనరాక్‌ చైర్మన్‌ అనూజ్‌ పూరి తెలిపారు. ఈ విభాగంలో సరఫరా కూడా మెరుగుపడింది.

కోవిడ్‌ తర్వాత, ఇంటి యాజమాన్యం అనే భావన బలపడింది. ప్రజలు కూడా మంచి, పెద్ద ఇళ్లకు అప్‌గ్రేడ్‌ అవుతున్నారు. అనరాక్‌ డేటా ప్రకారం, హైదరాబాద్‌లో విలాసవంతమైన గృహాల విక్రయాలు మూడు రెట్లు పెరిగి ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్‌ మధ్య కాలంలో 3,790 యూనిట్ల నుంచి 13,630 యూనిట్లకు చేరుకున్నాయి. సమీక్షా కాలంలో బెంగళూరులో 3,810 యూనిట్ల నుంచి 9,220 యూనిట్లకు పెరిగాయి.

అదేవిధంగా ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌)లో 74 శాతం పెరిగి 20,820 యూనిట్ల నుంచి 36,130 యూనిట్లకు, పూణేలో మూడు రెట్లు పెరిగి 2,350 యూనిట్ల నుంచి 6,850 యూనిట్లకు చేరుకున్నాయి. చెన్నైలో1,370 యూనిట్ల నుంచి 3,330 యూనిట్లకు, కోల్‌కతాలో 950 యూనిట్ల నుంచి 1,610 యూనిట్లకు చేరుకున్నాయి. అన్ని ధరల బ్రాకెట్లతో సహా, ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో ఈ ఏడు నగరాల్లో మొత్తం 3.49 లక్షల యూనిట్లు విక్రయించినట్లు అనరాక్‌ డేటా వెల్లడించింది. అందులో లగ్జరీ గృహాల వాటా 24 శాతంగా నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement