ప్రభన్యూస్: ప్రపంచ వ్యాప్తంగా క్రిఎ్టో కరెన్సీకి విశేష ఆదరణ లభిస్తోంది. భారతీయులు కూడా ఈ క్రిఎ్టో కరెన్సీ వెనుక పరుగులు పెడుతున్నారు. అయితే ఇక్కడ మాత్రం ఈ కరెన్సీకి అధికారిక అనుమతులు లేవు. దీంతో ప్రపంచ దేశాలు భారత్‌పై ఈ విషయమై ఒత్తిడి తెస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్వయస్థల్లో ఒకటైన ఇండియాలోనే క్రిఎ్టో కరెన్సీకి అనుమతులు లేకపోవడం బాధాకరం అంటూ చెబుతున్నాయి. క్రిఎ్టో కరెన్సీకి అనుమతి ఇవ్వాలంటూ.. ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో కోరుతున్నాయి. చట్టపరమైన అనుమతులు లేకపోయినా.. దేశంలో క్రిఎ్టో కరెన్సీ లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం క్రిఎ్టో కరెన్సీపై కీలక భేటీ జరిగింది. పార్లమెంట్‌లో.. మాజీ ఆర్థిక శాఖ మంత్రి, పార్లమెంట్ సభ్యుడు జయంత్ సిన్హా నేతృత్వంలో ఈ భేటీ కొనసాగింది. అయితే క్రిఎ్టో కరెన్సీపై కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. క్రిఎ్టో కరెన్సీ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న టెక్నాలజీ అని, దీన్ని జాగ్రత్తగా గమనిస్తున్నామని, అవసరమైన సమయంలో సరైన చర్యలు తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఈ ఇండస్ట్రీ కోసం ముందు చూపుతో చర్యలు ఉంటాయని చెప్పుకొచ్చిం ది.
క్రిఎ్టో కరెన్సీకు సరిహద్దులు ఉండవని, ఇతర దేశాలతో కూడా కలిసి వ్యూహాత్మక భాగస్వామ్యం తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఆర్‌బీఐ, ఆర్థిక శాఖ, హోంమంత్రిత్వ శాఖలు క్రిఎ్టోపై పని చేస్తున్నాయని తెలిపింది. గ్లోబల్‌గా ఉండే మంచి చర్యలతో పాటు సమస్యలను కూడా పరిశీలిస్తున్నాయని ప్రభుత్వ అధికారులు తెలిపారు. క్రిఎ్టో కరెన్సీపై సుప్రీం కోర్టు నిషేధం కొనసాగుతోంది. అయితే మరొ వైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నే నేరుగా డిజిటల్ కరెన్సీ విడుదల చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై కూడా గతంలో అనేక చర్చలు జరిగాయి. అయితే దీనిపై ఇంత వరకు ఓ నిర్ణయం తీసుకోలేదు. కాగా ప్రస్తుతం క్రిఎ్టోపై విధానపరమైన నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily