కరోనా వేరియంట్లు ప్రపంచాన్ని అతలాకుతలాం చేస్తున్నాయి..రూపం మార్చుకుంటున్న కరోనా ఆల్పా, బీటా, గామా అంటూ పలు రకాలుగా విజృంభిస్తోంది. ఇండియాలో సెకండ్ వేవ్ లో అల్లకల్లోలం సృష్టించిన డెల్టా వేరియంట్ అల్ఫా వేరియంట్ కంటే ప్రమాదకరమైనదని తాజా నివేదికలో వెల్లడయింది. డెల్టా వేరియంట్ అల్ఫా వేరియంట్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్నది..అయితే, ఇండియాలో సెకండ్ వేవ్ కు కారణమైన డెల్టా వేరియంట్‌లు ఆల్ఫా వేరియంట్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్నది. డెల్టా వేరియంట్ కారణంగా ఇండియాలో రోజూ వేలాది కేసులు, మరణాలు సంభవించాయి. ఈ వేరియంట్ ఇప్పుడు ప్రపంచంలోని 111కు పైగా దేశాల్లో వ్యాపించింది. ఆల్ఫా వేరియంట్ కంటే 60 నుంచి 80 శాతం వేగంగా ఈ వేరియంట్ వ్యాపిస్తుండటం విశేషం. అయితే కరోనా పూర్తిగా అంతం కావాలంటే ప్రజలందరు వ్యాక్సిన్ వేసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.. మాస్కులతో పాటు శానిటైజర్ కూడా వాడాల్సిందేనని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి : ఆ బిల్లు పార్లమెంట్‌లోకి వస్తే దేశమంతా అంధకారం చేస్తాం