Saturday, November 23, 2024

డెల్టా వేరియంట్ ఎఫెక్ట్ అమెరికాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

అమెరికాలో అనేక ప్రాంతాల్లో డెల్టా వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. దాదాపు 80 శాతం కేసులు డెల్టా వేరియంట్. డెల్టా వేరియంట్ అమెరికాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో సగానికి పైగా డెల్టా వేరియంట్ వేనని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఆఫ్ ప్రివెన్షన్ తెలిపింది. కరోనా వేరియంట్లలో డెల్టా చాలా స్పీడుగా ఉందని చెప్పింది. కరోనా తొలి నాళ్లలో ఆల్ఫా వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదు కాగా… ఇప్పుడు వాటి సంఖ్య 28.7 శాతానికి తగ్గింది.

డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అమెరికా వైద్య నిపుణులు డాక్టర్ ఫౌచి మాట్లాడుతూ… ఇది వేగంగా వ్యాప్తి చెందడమే కాకుండా, ఎక్కువ ప్రభావాన్ని కూడా చూపుతోందని హెచ్చరించారు. రానున్న రోజుల్లో ఈ వేరియంట్ మరింత ప్రమాదకారిగా మారుతుందని అన్నారు.
మరో కీలక విషయం ఏమిటంటే కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నవారికి కూడా మళ్లీ కరోనా సోకుతోంది. అయితే, ఇలాంటి కేసులు చాలా తక్కువగా ఉంటున్నాయి. వీరికి కరోనా సోకినా, ప్రాణగండం మాత్రం లేకపోవడం గమనార్హం.

ఇది కూడా చదవండి: ఈపీఎఫ్ ఖాతాదారులకు ఊరట..

Advertisement

తాజా వార్తలు

Advertisement