దేశంలో ఓ వైపు కరోనా వైరస్ వల్ల మరణాలు సంభవిస్తుంటే.. మరో వైపు డెల్టా ప్లస్ వేరియంట్ కూడా విజృంభిస్తోంది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా డెల్టా ప్లస్ వేరియంట్ వల్ల దేశంలో రెండో మరణం నమోదైంది. గురువారం నాడు మధ్యప్రదేశ్‌లో ఓ మహిళ చనిపోగా ఇవాళ అదే రాష్ట్రంలో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. చనిపోయిన వారు వ్యాక్సిన్ తీసుకోలేదని వైద్యశాఖ అధికారులు తెలిపారు. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు ఏడు డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయి. ఆ ఏడుగురిలో ముగ్గురు టీకాలు వేయించుకున్నారు. వారు కోలుకుని, హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు అధికారులు వివరించారు.
ఇది కూడా చదవండి: కొవాగ్జిన్‌కు పూర్తి స్థాయి అనుమతి ఇవ్వని డీసీజీఐ