ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్ కేసులు విస్తరిస్తున్నాయని WHO హెచ్చరిస్తుంది. ఇప్పటికే 85 దేశాల్లో డెల్టా వేరియంట్ కేసులు నమోదయ్యాయని WHO ప్రకటించింది . గతంలో కంటే ఇది అత్యంత వేగంగా వ్యాపిస్తోందని , ఇదే ట్రెండ్ కొనసాగితే మరింత ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించింది. ఇది మరిన్ని దేశాల్లో ప్రబలం కావచ్ఛునని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. 170 దేశాల్లో వేరియంట్ అల్ఫా, 119 దేశాల్లో వేరియంట్ బేటా, 71 దేశాల్లో గామా కొనసాగుతున్నాయని. వీటిని నిర్లక్ష్యం చేయరాదని ఈ సంస్థ ఈ నెల 22 నాటి తన తాజా నివేదికలో తెలిపింది.
ఇదే సమయంలో ఇండియాలో అన్-లాక్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి తిరిగి కేసులు పెరుగుతున్న తీరును తాము గమనిస్తున్నట్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేర్కొంది. వివిధ రకాల వ్యాక్సిన్లు ఈ వేరియంట్లను కట్టడి చేస్తున్నప్పటికీ.. కోవిద్ ప్రొటొకాల్స్ మాత్రం తప్పదని..మాస్కుల ధారణ, భౌతిక దూరం పాటింపు వంటివి నేటికీ అనివార్యమని పేర్కొంది.. డెల్టా వేరియంట్ సోకిన వారికి ఆక్సిజన్ అవసరం , ఐసీయూలో చేరే పరిస్థితి అధికంగా ఉంటుందని , మరణాలు కూడా ఎక్కువేనని సింగపూర్ నివేదిక వెల్లడించింది.