ఏపీలో తొలి డెల్టా ప్లస్ వేరియంట్ కేసు నమోదైంది. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. కొన్నిరోజుల ముందు తిరుపతిలో డెల్టా ప్లస్ కేసు నమోదైందని చెప్పిన ఆయన.. సదరు వ్యక్తికి చికిత్స కూడా పూర్తయిందన్నారు. అయితే బాధితుడి నుంచి ఇతరులకు డెల్టా ప్లస్ వేరియంట్ సోకలేదని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు.
కాగా ఈ రోజు కరోనా నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో మంత్రి ఆళ్ల నాని కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బ్లాక్ ఫంగస్, డెల్టా ప్లస్ కేసుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు ప్రజలు నిబంధనలు పాటించాలని, కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ఇది కూడా చదవండి: డెల్టా ప్లస్ వేరియంట్‌కు వ్యాక్సిన్ పనిచేస్తుందా?