Saturday, November 23, 2024

అమెరికాపై డెల్టా, ఒమిక్రాన్‌ దాడి.. రోజుకు 2లక్షలకు పైగా కేసులు

అమెరికాలో డెల్టా, ఒమిక్రాన్‌ వేరియంట్లు వణికిస్తున్నాయి. ఆ రెండూ కలిసి డెల్మిక్రాన్‌ డబుల్‌ వేరియంట్‌గా మారి అమెరికా వాసులను భయాందోళనకు గురిచేస్తోంది. డెల్టా, ఒమిక్రాన్‌ వేరియంట్ల స్పైక్‌ ప్రొటీన్ల మ్యూటేషన్లతో ఏర్పడిన డెల్మిక్రాన్‌.. చాప కింద నీరులా వ్యాపిస్తోందని అమెరికా వైద్య ఆరోగ్య శాఖ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి డెల్మిక్రాన్‌ కేసులు అమెరికా, బ్రిటన్‌లో విపరీతంగా బయటపడుతున్నాయి. రోజువారీ కేసులు లక్షకు పైగా నమోదు కావడానికి డెల్మిక్రాన్‌ కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో గడిచిన 24 గంటల్లో 1,97,856 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 747 మంది చనిపోయారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 5,29,86,307కు చేరుకుంది. మృతులు 8,37,671కు చేరుకున్నారు. గడిచిన 24 గంటల్లో 29,257 మంది రికవరీ అయ్యారు.

దీంతో ఇప్పటి వరకు కరోనాను జయించిన వారి సంఖ్య 4,09,94,250కు చేరుకుంది. ప్రస్తుతం అమెరికాలో 1,11,54,386 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 16,167 మంది పరిస్థితి విషమంగా ఉంది. 2021, జనవరి తరువాతే ఇంత భారీ కేసులు నమోదవుతున్నాయి. అమెరికాలో ఒమిక్రాన్‌ బారిననపడే వారి సంఖ్య కూడా 73 శాతానికి పెరిగింది. చాలా మంది ఈనాటికి కూడా వ్యాక్సిన్లు వేయించుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు. దీంతో కరోనా కొత్త వేరియంట్లు దాడి చేస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement