ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు లక్నోతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించింది. తొలుత బౌలింగ్‌లో లక్నో జట్టును తక్కువ పరుగులకే పరిమితం చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఛేజింగ్‌లో రాణించింది. దీంతో లక్నో నిర్దేశించిన లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో ఛేదించి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
లక్నో నిర్దేశించిన 168 పరుగుల ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు పృథ్వీ షా (32), డేవిడ్ వార్నర్ (8) ఔటయ్యారు. ఆ తర్వాత యువ ఆటగాడు జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్, కెప్టెన్ రిషబ్ పంత్ బౌండరీలతో చెలరేగారు. జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ (55: 35 బంతుల్లో 5 సిక్సర్లు, 2 4) హాప్ సెంచరీ సాధించాడు. మరో ఎండ్‌లో రిషబ్ పంత్ (41: 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి తృటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇక చివరగా ట్రిస్టన్ స్టబ్స్ (15 నాటౌట్) విన్నింగ్ షాట్ ఆడి జట్టును గెలిపించాడు. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్ రెండు వికెట్లు తీయగా… యష్ రవిసింగ్ ఠాకూర్, నవీన్ ఉల్ హక్ చెరో వికెట్ దక్కించుకున్నారు.