ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ లక్నోతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ బౌలర్లు రెచ్చిపోయారు. విధ్వంసక బ్యాటర్లను తక్కువ పరుగులకే పెవిలియన్ చేర్చారు. అయితే చివర్లో లక్నో బ్యాట్స్మెన్ ఆయుష్ బదోని చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. తద్వారా లక్నో జట్టు ఢిల్లీపై పోరుకు 168 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.
లక్నో స్టార్ బ్యాట్స్మెన్ల పేలవ ప్రదర్శనతో కష్టాల్లోపడ్డ జట్టును అర్షద్ ఖాన్ 20 (నాటౌట్) సపోర్ట్ తో బదోని 55 (నాటౌట్) అర్ధ సెంచరీ ఆదుకున్నాడు. ఇక ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు దక్కించుకొగా.. ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు తీశాడు. ఇక ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్ ఒక్కో వికెట్ పడగొట్టారు.