Tuesday, November 26, 2024

diwali: ఢిల్లీలో వాయు కాలుష్యం

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరుకుంది. దీపావళి సందర్భంగా కాల్చిన టపాసులతో వాయు కాలుష్యం ఎక్కువైంది. దాంతో ఢిల్లీ సహా దాని చుట్టుపక్కల ప్రాంతాలపై తీవ్రంగా పడింది. గాలి నాణ్యత పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 382గా నమోదు అయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 314 నుంచి 341 వద్ద ఉండగా, దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చడంతో నోయిడాలో ఏక్యూఐ526కు పెరిగింది. టపాసుల పేల్చిన తర్వాత గురువారం రాత్రి 9 గంటలకు ఢిల్లీ చుట్టుపక్కల ఫరిదాబాద్ (424), ఘాజియాబాద్ (442), గురుగ్రామ్ (423), నొయిడా (431) గాలిలో నాణ్యత తగ్గి పరిస్థితి తీవ్రమయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement