Saturday, November 23, 2024

ఢిల్లీలో డేంజర్​ లెవల్స్​కి చేరుతున్న ఎయిర్​ పొల్యూషన్​.. శ్వాస కష్టమే అంటున్న డాక్టర్లు!

ఢిల్లీలో ఎయిర్​ పొల్యూషన్​ మళ్లీ స్టార్ట్​ అయ్యింది. మొన్నటిదాకా వర్షాలు, గాలులతో కాస్త మంచి గాలితో ఊపిరితీసుకున్న సిటీ జనం.. ఇప్పుడు మరోసారి డేంజర్​లో పడుతున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతోపాటు పొరుగు రాష్ట్రాల్లోని రైతులు తమ పొలాల్లోని పంట అవశేషాలను కాల్చడం ప్రారంభిస్తున్నారు. దీంతో పొల్యూషన్​ రోజురోజుకు తీవ్రమవుతోంది. ఇవ్వాల (బుధవారం) ఉదయం 7 గంటలకు ఢిల్లీ ఆనంద్ విహార్‌లో ఎయిర్​ క్వాలిటీ ఇండెక్స్​ (AQI) 263గా నమోదైంది. ఇది చాలా డేంజరస్​ అని, ఎయిర్​ పొల్యూషన్​ దెబ్బతింటోందని అధికారులు అంటున్నారు.  

నిన్న కూడా ఢిల్లీలోని అత్యంత కలుషితమైన పొరుగున ఉన్న ఆనంద్ విహార్‌లో గాలి నాణ్యత సూచిక కీలకమైన కేటగిరీకి చేరుకుంది. సోమవారం ఢిల్లీ AQI 180తో మబ్బుగా ఉన్న ఎయిర్​ క్వాలిటీని నివేదించింది. ఇక ఆదివారం 119, శనివారం 70, శుక్రవారం 47గా ఎయిర్​ క్వాలిటీ ఇండెక్స్​ సూచిస్తోంది. ఇప్పటికే కార్డియోపల్మోనరీ వ్యాధులు ఉన్నవారికి ఇట్లాంటి వాతావరణం తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుందని డాక్టర్లు అంటున్నారు.  దీంతో శ్వాస సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు, ఆస్తమా, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక 100 కంటే ఎక్కువగా ఉంది.  ఇది నివాసితులకు ప్రమాదకరం. సున్నా నుండి 50 వరకు ఉన్న AQI “అద్భుతమైనది”గా పరిగణిస్తారు.  51 నుండి 100 వరకు “ఆమోదయోగ్యం”గా సూచిస్తారు. 101 నుండి 200 వరకు  మధ్యస్థం, 201 నుండి 300 వరకు పూర్​గా పరిగణిస్తారు, 301 నుండి 400 వరకు వెరీ పూర్​ ఎయిర్​ క్వాలిటీగా పేర్కొంటున్నారు వాతావరణ నిపుణులు. ఇక.. 401 నుండి 500 వరకు డేంజరస్​గా పరిగణించబడుతుంది.- స్కైమెట్ వెదర్​ రిపోర్టు ప్రకారం.. తూర్పు,  పశ్చిమం నుంచి వీస్తున్న గాలుల కారణంగా ఢిల్లీలోని ఎయిర్​ క్వాలిటీ దెబ్బతింటోందని, గాలి కాలుష్య కారకాలు ఎక్కువగా వస్తున్నాయని తెలుస్తోంది.

ఉధృతంగా వీస్తున్న గాలుల కారణంగా ఉదయం నుంచి కాలుష్య కారకాలు సిటీని ముంచెత్తుతున్నాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ ప్రకారం.. సెప్టెంబర్ 19న ఢిల్లీలో సంభవించిన PM2.5 కాలుష్యానికి రవాణా పరిశ్రమ 14-22% కారణమైంది. సెప్టెంబర్ 21 నాటికి ఇది 33% పెరుగుతుందని అంచనా.

- Advertisement -

ఢిల్లీ పర్యావరణ మంత్రి శీతాకాలపు వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి సెప్టెంబర్‌లో నగర ప్రభుత్వం 15 పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను ప్రారంభిస్తుందని గోపాల్ రాయ్ గతంలో ప్రకటించారు. ఈ ప్రణాళికలో చెత్త నిర్వహణ, దుమ్ము కాలుష్యం, వాహన ఉద్గారాలు, బహిరంగ చెత్త దహనం, పారిశ్రామిక కాలుష్యం, గ్రీన్ వార్ రూమ్, గ్రీన్ ఢిల్లీ అప్లికేషన్, కాలుష్య హాట్‌స్పాట్‌లు, రియల్ టైమ్ విభజన అధ్యయనం, స్మాగ్ టవర్, ఈ-వేస్ట్ పార్కులు, ప్లాంటేషన్, ఎకో ఫార్మింగ్ వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement