ఐపీఎల్లో భాగంగా ఆదివారం విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. కాగా, ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఢిల్లీ క్యాపిటల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లకు విశాఖపట్నంను తమ హోమ్ గ్రౌండ్‌గా ఎంచుకుంది. దీంతో విశాఖ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో తొలి బ్యాటింగ్ తో బరిలోకి దిగనుంది. ఇక మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.
డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకెళ్తుండగా, ఢిల్లీ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. దీంతో ఈ మ్యాచ్ లో గెలిచి శుభారంభం చేయాలనే పట్టుదలతో ఢిల్లీ పోరుకు సిద్ధమైంది. అయితే బలమైన చెన్నైపై పోరు ఢిల్లీకి సవాల్‌గా మారింది.
జట్ల వివరాలు :
చెన్నై సూపర్ కింగ్స్ :
రుతురాజ్ గైక్వాడ్ (c), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (wk), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మతీషా పతిరానా, ముస్తాఫిజుర్ రెహమాన్
ఢిల్లీ క్యాపిటల్స్ :
పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (c&wk), ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, అన్రిచ్ నార్ట్జే, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్