న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న తమకు అండగా నిలవాలని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు వివరించారు. దివ్యాంగులకు ప్రత్యేకంగా వృతి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి, నిరుద్యోగులకు అండగా ఉండాలని, ఎలాంటి పూచీకత్తు లేకుండా 10 లక్షల లోన్ ఇవ్వాలని, తమకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, దివ్యాంగులకు ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని కొల్లి నాగేశ్వరరావు కోరారు. గురువారం ఆయన పలువురు దివ్యాంగ నాయకులతో వివిధ పార్టీల ఎంపీలను కలిసి తమ సమస్యల పరిష్కారానికి అండగా నిలవాలని కోరారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement