Sunday, November 17, 2024

Delhi లో కలకలం .. పార్లమెంట్‌లోకి చొరబడేందుకు య‌త్నం


దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేగింది. నకిలీ ఆధార్‌తో పార్లమెంట్‌లోకి ప్రవేశించేందుకు యత్నించిన ముగ్గురు వ్యక్తులను భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. శుక్రవారం ఉదయం ముగ్గురు వ్యక్తులు నకిలీ ఆధార్ కార్డుల సాయంతో పార్లమెంట్‌ భవనం గేట్ నంబర్ 3 ద్వారా లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వారి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో భద్రతా సిబ్బంది వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

ముగ్గురు నిందితులు కాసిం, మోనిస్‌, సోయెబ్‌లుగా గుర్తించారు. వీరు ఉత్తరప్రదేశ్‌కు చెందిన కూలీలుగా విచారణలో తేలింది. ఈ మేరకు ముగ్గురిని అరెస్ట్‌ చేసి ఫోర్జరీ, మోసం కింద కేసులు బుక్‌ చేశారు. అరెస్టైన ముగ్గురు వ్యక్తులు పార్లమెంట్ కాంప్లెక్స్‌లో ఎంపీ లాంజ్‌ను నిర్మించేందుకు కాంట్రాక్ట్ తీసుకున్న డీ వీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌లో పనిచేస్తున్నట్లు స‌మాచారం. ఈ రోజు ఢిలీలో పలు కీలక సమావేశాలు, ఎంపీలతో ఎన్డీఏ కూటమి సమావేశాలు ఉన్న ఈ క్రమంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement