Friday, November 15, 2024

ఢిల్లి యూనివర్సిటీ కీలక నిర్ణయం.. ఇక్బాల్‌ పాఠ్యాంశం తొలగింపు!

ఢిల్లి విశ్వవిద్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. రాజనీతి శాస్త్రం నుంచి పాకిస్థాన్‌ కవి మహ్మద్‌ ఇక్బాల్‌పై ఉన్న పాఠ్యభాగాన్ని తొలగించేందుకు విశ్వవిద్యాలయం అకడమిక్‌ కౌన్సిల్‌ ఒక తీర్మానాన్ని పాస్‌చేసింది. వీసీ యోగేశ్‌ ప్రతిపాదించిన తీర్మానాన్ని అకడమిక్‌ కౌన్సిల్‌ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు అధికారులు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ అంశం తుదినిర్ణయం కోసం ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ ముందు ఉంది.

- Advertisement -

తాజా పరిణామంపై ఢిల్లి వైస్‌ చాన్స్‌లర్‌ యోగేశ్‌ సింగ్‌ స్పందిస్తూ, దేశవిభజనకు పునాది వేసిన వ్యక్తులకు సిలబస్‌లో స్థానం ఉండకూడదని అన్నారు. పాకిస్థాన్‌ ఏర్పాటు గురించి మొదట లేవనెత్తిన వ్యక్తి ఇక్బాల్‌. వారికి బదులు మన జాతి హీరోల గురించి తెలుసుకుందాం. భారత విభజనకు పునాది వేసిన వ్యక్తులు మన సిలబస్‌లో భాగం కాకూడదుఅని యోగేశ్‌ వ్యాఖ్యానించారు.

ఈ మేరకు విశ్వవిద్యాలయం ఓ ప్రకటన జారీ చేసింది. అత్యంత ప్రజాదరణ పొందిన ‘సారే జహాసే అచ్చా’ పాటను రాసింది మహ్మద్‌ ఇక్మాల్‌. ఆయన 1877లో అవిభాజ్య భారత్‌లోని సియాల్‌కోటలో జన్మించారు. ప్రత్యేక పాకిస్థాన్‌ ఏర్పాటు ఆలోచనకు మూలం ఇక్బాల్‌ అని చెప్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement