Wednesday, September 18, 2024

Delhi Tragedy – వ్యాపార కేంద్రాలుగా కోచింగ్ సెంట‌ర్లు … రాజ్య‌స‌భ చైర్మ‌న్

పార్ల‌మెంట్ లో డిల్లీ స్ట‌డీ సెంట‌ర్ విషాదంపై ప్ర‌కంప‌న‌లు
ఘాటుగా స్పందించిన రాజ్య‌స‌భ చైర్మ‌న్
ఆప్ ప్ర‌భుత్వంపై బిజెపి గ‌రం గ‌రం
ఇప్ప‌టికే ఈ ఘ‌ట‌న‌లో అయిదుగురు అరెస్ట్
13 కోచింగ్ సెంటర్లు సీజ్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – న్యూఢిల్లీ – దేశ రాజధానిలో దిగ్భ్రాంతకర ఘటన చోటు చేసుకుంది. ఐఏఎస్ కావాలని కలలు గన్న ముగ్గురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ఢిల్లీలోని ఓ ఐఏఎస్‌ కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో భవనం బేస్‌మెంట్‌లో నీటిలో చిక్కుకుని జల సమాధి అయ్యారు. వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. తాజాగా ఈ అంశం ఉభయసభల్లో ప్ర‌కంప‌న‌లు సృష్టించింది. దీనిపై రాజ్యసభలో చర్చ ప్రారంభిస్తూ,, ఛైర్మన్‌ జగదీప్ ధంఖర్ నేడు కోచింగ్ వ్యాపారంగా మారిందని మండిపడ్డారు. “కోచింగ్ అనేది నేడు ఒక రకమైన వ్యాపారంగా మారింది. మనం తరచుగా వార్తాపత్రికలను చూసినప్పుడు మొదటి లేదా రెండు పేజీలలో వాటి ప్రకటనలు భారీగా కనిపిస్తాయి.” అని వ్యాఖ్యానించారు.

- Advertisement -

లోక్ స‌భ‌ లో ప్రస్తావన..
లోక్‌సభలో న్యూఢిల్లీ ఎంపీ బన్సూరి స్వరాజ్ రాజేంద్ర నగర్ కోచింగ్ ప్రమాదంపై మాట్లాడుతూ, . కోచింగ్ ప్రమాదంపై విచారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.. ఈ ఘ‌ట‌న‌కు ఆప్ ప్రభుత్వం బాధ్య‌త వ‌హించాల‌ని కోరారు. . ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని.. ఢిల్లీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. మరోవైపు కన్నౌజ్ ఎంపీ, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా ఢిల్లీలో జరిగిన ఈ ప్రమాదంపై ప్రశ్నించారు. ఇప్పటి వరకు బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అఖిలేష్ యాదవ్ అడిగారు. ఈ ఘటన బాధాకరమని, ఇలాంటి కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లపై ప్రభుత్వం బుల్‌డోజర్లను నడుపుతుందా? అని నిలదీశారు.

కాగా ఇప్ప‌టికీ ఈ ప్ర‌మాదంలో అయిదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.. అలాగే సెల్లార్ ల‌లో నిర్వ‌హిస్తున్న13 స్ట‌డీ సెంట‌ర్ ల‌ను ఢిల్లీ అధికారులు సీజ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement