Friday, November 22, 2024

ఢిల్లి గజగజ.. 2.2కు పడిపోయిన ఉష్ణోగ్రతలు

దేశ రాజధాని చలి గుప్పిట్లో చిక్కుకుంది. ఢిల్లి గజగజ వణికిపోతోంది. గురువారం ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఈ సీజన్‌లో ఉష్ణోగ్రత అత్యల్పంగా 2.2 డిగ్రీలకు తగ్గిపోయింది. దీంతో ఢిల్లి వాసులు ఇళ్లకే పరిమితమయ్యారు. దట్టమైన పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

రైళ్ల రాకపోకలపైనా తీవ్ర ప్రభావం పడింది. ఢిల్లి విమానాశ్రయంలోనూ అదే పరిస్థితి. పొంగమంచు కప్పేయడంతో రన్‌వే పూర్తిగా కనిపించడం లేదు. పలు విమానాలను దారి మళ్లించారు. మరో రెండు రోజులు చలి తీవ్రత ఇలాగే ఉంటుందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement