Tuesday, November 26, 2024

Delhi | ముంపు సమస్యపై పోరాటం.. జంతర్ మంతర్‌లో పోలవరం నిర్వాసితుల ధర్నా


న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: 
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు మద్దతుగా ఆగస్టు 7న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తామని భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) ప్రకటించింది. ఢిల్లీలోని హరికిషన్ సింగ్ సూర్జిత్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ఈ విషయం ప్రకటించారు. వరదల్లో పోలవరం ముంపు ప్రాంతాలన్నీ నీట మునిగినా సరే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని అన్నారు.

జులై 18 నుంచి 30వ తేదీ వరకు ముంపు ప్రాంతాలకు దూరంగా ఉన్న గ్రామాలు సైతం నీట మునిగిపోయాయని తెలిపారు. మరోవైపు ముంపు సితులకు పరిహారం, పునరావాసం ప్యాకేజి నిధులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష ప్రదర్శిస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే తమ పోరాటాన్ని రాష్ట్రంలోనూ ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టుపై సాంకేతిక నిపుణులతో విచారణ జరిపించాలని, ఎక్కడ ఏం తప్పు జరిగిందో బయటపెట్టాలని అన్నారు.

- Advertisement -

మరోవైపు చిత్తూరులో జరిగిన ఘటనపై స్పందిస్తూ పోలీస్ యంత్రాంగం అన్ని పార్టీలను ఒకేలా చూడాలని అన్నారు. అక్కడ వాతావరణం రణరంగంగా మారడానికి కారణం అధికార పార్టీ తీరేనని అన్నారు. రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలంతా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని, కానీ రాష్ట్రంలోని అధికార, విపక్షాలు మాత్రం బీజేపీకి మద్దతిస్తూ వంతపాడుతున్నాయని శ్రీనివాస రావు విమర్శించారు. ప్రాంతీయ పార్టీలు బీజేపీకి దూరంగా ఉంటేనే ఉనికి చాటుకుంటాయని హితవు పలికారు. జనసేన కూడా బీజేపీకి దూరంగా ఉండాలని సూచించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement