న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలిగా సాయని విజయ భారతి గురువారం బాధ్యతలు చేపట్టారు. న్యాయవాదిగా, సామాజికవేత్తగా తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న విజయభారతిని ఎన్.హెచ్.ఆర్.సీ సభ్యురాలిగా నియమిస్తూ బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం ఢిల్లీలోని ఎన్.హెచ్.ఆర్.సీ ప్రధాన కార్యాలయంలో చైర్మన్ అరుణ్ కుమార్ మిశ్రా సమక్షంలో విజయభారతి బాధ్యతలు స్వీకరించారు. తనపై విశ్వాసంతో ఈ బాధ్యతలు అప్పగించిన రాష్ట్రపతికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. తనపై పెట్టిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని ఈ సందర్భంగా విజయభారతి పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement