ఢిల్లీ: ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాషాయం పార్టీ భారీ మార్పులకు.. చేర్పులకు దిగుతోంది. ఈ క్రమంలో తాజాగా నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించింది. తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా జాతీయస్థాయి సీనియర్ నేత ప్రకాష్ జవదేకర్(72)ను నియమించింది ఆ పార్టీ అధిష్టానం. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన చేసింది. అలాగే సహాయ ఇన్‌ఛార్జ్‌గా సునీల్ బన్సల్‌ను నియమించింది. ఇక ప్రకాశ్ జవదేకర్ గతంలో కేంద్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగానూ పని చేశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్.. ఇలా 2008 నుంచి ఆయన రాజ్యసభకు ఎన్నికవుతూ వస్తున్నారు. పార్లమెంట్‌లో పలు కమిటీలకు ఆయన చైర్మన్‌గా వ్యవహరిచారు. 2021లో కేంద్ర మంత్రి పదవికి దూరమైన ఆయన.. అప్పటి నుంచి పార్టీ అధికార ప్రతినిధిగానూ కొనసాగుతున్నారు. బిజెపిలో కీలకనేతగా ఉన్న జవదేకర్ తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తీసుకువస్తాడనే భరోసాతో పార్టీ ఎన్నికల ఇన్ చార్జీ గా నియమించింది.
ఇక రాజస్థాన్ బీజేపీ ఎన్నిలక ఇన్‌ఛార్జ్‌గా ప్రహ్లాద్ జోషి, మధ్యప్రదేశ్ ఇన్‌చార్జ్‌గా భూపేంద్ర యాదవ్, ఛత్తీస్‌గఢ్‌కు ఓం ప్రకాశ్ మాథూర్ లను నియమించింది.