ఢిల్లీలో రోజురోజుకు వాయు కాలుష్యం పెరుగుతూ వస్తుంది. చలి తీవ్రత పెరుగుతుండడంతో దానికి తోడు పొల్యూషన్ కూడా భారీ పెరుగుతుంది. దీంతో దట్టమైన పొగమంచు కమ్ముకుంటుంది. ఈ పొగమంచు కారణంగా విజిబిలిటీ పూర్తిగా పడిపోయి రోడ్లపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ఢిల్లీలో సగటు గాలి నాణ్యత రికార్డు స్థాయిలో 317కు పడిపోయింది. ఢిల్లీ యూనివర్సిటీ, ఐఐటీ ఢిల్లీ ఏరియాల్లో AQI 311గా ఉన్నది. అక్కడ మొత్తం 70 మీటర్ల మేర విజిబిలిటీ తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. లోధి రోడ్ ఏరియాలో కాస్త తక్కువగా 303 ఉన్నది. మథుర రోడ్లో అత్యధికంగా 332 స్థాయికి గాలి నాణ్యత పడిపోయింది. ఢిల్లీ ఎయిర్పోర్టు టర్మినల్లో 334గా నమోదైంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి, కాలుష్యం లేదని అర్థం. AQI 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉందని, AQI 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని, AQI 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, AQI 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని అర్థం. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement