Monday, November 18, 2024

ఢిల్లి పోలీస్‌ కమిషనర్‌గా సంజయ్‌ అరోరా.. రేప‌టి నుంచి ఆన్ డ్యూటీ..

దేశ రాజధాని ఢిల్లి పోలిస్‌ కమిషనర్‌గా సంజయ్‌ అరోరా నియమితులయ్యారు. ప్రస్తుత ఢిల్లి పోలీస్‌ బాస్‌ రాకేష్‌ అస్థానా స్థానంలో సోమవారంనాడు ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. 2025 జులై 31 లేదా తదుపరి ఉత్తర్వుల వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. తమిళనాడు కేడర్‌కు చెందిన ఐపిీఎస్‌ అధికారి సంజయ్‌ అరోరా ప్రస్తుతం ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ) డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌.ఎల్‌.థాయోసెస్‌కు ఐటీబీపీ అదనపు బాధ్యతలు అప్పగించారు.

కాగా అరుణాచల్‌ ప్రదేశ్‌ గోవా మిజోరం- కేంద్రపాలిత ప్రాంతం (ఏజీఎంయూటీ) కేడర్‌ వెలుపల నుంచి దేశ రాజధాని ఢిల్లి పోలీస్‌ కమిషనర్‌గా నియమితులైన మూడో అధికారి సంజయ్‌ అరోరా. 1988 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన ఆయన జైపూర్‌లోని మాల్వియా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పట్టా పొందారు. అనంతరం ఐపీఎస్‌లో చేరిన తర్వాత తొలుత తమిళనాడులో వివిధ హోదాల్లో పని చేశారు. స్మగ్లర్‌ వీరప్పన్‌, అతడి ముఠాను పట్టుకునేందుకు నియమించిన టాస్క్‌ఫోర్స్‌లో కీలకంగా వ్యవహరించారు.గత ఏడాది ఆగస్టులో ఐటిబిపి చీఫ్‌ గా నియమితులయ్యారు. ఆయన విశిష్ట సేవలకుగాను రాష్ట్రపతి పోలీసు పతకం, ఇతర గౌరవాలతో పాటు యూఎన్‌ శాంతి పరిరక్షక పతకం కూడా లభించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement