Tuesday, November 26, 2024

Delhi | ఢిల్లీ ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధం-ఎంపీ రంజిత్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను గవర్నర్లకు అప్పగిస్తే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఏం చేయాలని బీఆర్‌ఎస్ చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి ప్రశ్నించారు. పార్లమెంట్‌లో మంగళవారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై ఆయన మాట్లాడారు. ఢిల్లీ ఆర్డినెన్స్ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమన్నారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో కేంద్రం గవర్నర్ల ద్వారా అధికారం చెలాయించే ప్రయత్నం చేస్తోందని రంజిత్ దుయ్యబట్టారు. ఆర్.ఆర్.ఆర్ విధానంలో అధికారులు కేబినెట్ మంత్రులకు, మంత్రులు ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని, ఈ ఆర్డినెన్సును బీఆర్ఎస్ మొదటి నుంచి వ్యతిరేకిస్తోందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement