ఢిల్లి మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికలు డిసెంబర్ 4న జరుగుతాయని ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విజయ్ దేవ్ షెడ్యూల్ విడుదల చేశారు. డిసెంబర్ 7వ తేదీన ఓట్ల లెక్కింపు, అదేరోజు ఫలితాలు ప్రకటిస్తామన్నారు. నవంబర్ 7న నోటిఫికేషన్ విడుదల చేస్తామని, 14వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు, అనంతరం 19వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని వివరించారు. వార్డుల పునర్విభజన ఇప్పటికే పూర్తయ్యిందని, మొత్తం 250 వార్డులు ఉన్నాయని పేర్కొన్నారు. వార్డుల పునర్విభజన ప్రక్రియపై ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
మరోవైపు మునిసిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని అటు బీజేపీ, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహ ప్రతివ్యూహాలు చేస్తున్నాయి. వచ్చే అసెంబ్లి ఎన్నికలకు ఇవి సెమీఫైనల్స్‌గా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా సత్తా చాటేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అయితే, పోటీ మాత్రం బీజేపీ- ఆప్‌ల మధ్య ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.