Friday, October 18, 2024

Delhi – ఎన్డీఎ ప‌క్ష‌నేత‌గా మోదీ… 9న ప్రధానిగా ప్రమాణ స్వీకారం

ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమాల్లో బిజీగా ఉంది. పార్లమెంట్ సెంట్రల్ హాలులో నేడు ఎన్డీఏ పక్షాల నేత సమావేశం నేడు జ‌రిగింది. ఈ స‌మావేశంలో ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీ పేరును రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనను అమిత్ షా, నితిన్ గడ్కరీ బలపరిచారు. ఎన్డీఏ లోక్ సభ పక్ష నేతగా మోదీని సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

రాష్ట్ర‌పతిని క‌లువ‌నున్న నేత‌లు

ఈ రోజు రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఎన్డీఏ పక్ష నేతలు కలుస్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఎంపీల సంతకాలతో కూడిన లేఖను అందజేస్తారు.ఇక , జూన్ 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు భారత ప్రధానిగా మూడోసారి మోదీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎన్డీఏ సమావేశానికి ఎన్డీఏ పక్ష నేతలు నితీశ్ కుమార్, పవన్ కల్యాణ్, అజిత్ పవార్ తదితరులు హాజరయ్యారు. ఎన్డీఏ పక్ష ఎంపీలు కూడా హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement