Monday, November 25, 2024

Delhi: వైర‌ల్ గా మోదీ, దీదీ డ్యాన్స్ వీడియో

మ‌న‌సారా న‌వ్వుకున్న ప్ర‌ధాని
క్రియేట‌ర్ కు ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌శంస‌లు
బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఆగ్ర‌హం
క్రియేట‌ర్ ను అరెస్ట్ చేయాల‌ని ఆదేశం
దేశంలో అత్యంత కీలకమైన లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలన్ని కదనరంగంలోకి దిగాయి. మండుటెండలను సైతం లెక్కచేయకుండా నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు… ఈ క్రమంలోనే వారి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇలా సీరియస్ గా రాజకీయ వాతావరణాన్ని కూల్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డ్యాన్సింగ్ వీడియోలు బయటకు వచ్చాయి.

ఎవరు రూపొందించారో గానీ ప్రధాని మోడీ కుర్రాడిలా డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సేమ్ టు సేమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా హుషారుగా డ్యాన్స్ చేస్తున్న కార్టూన్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇద్దరూ రాజకీయ నాయకులే ఉన్నత పదవుల్లో వున్నవారే… కానీ డ్యాన్సింగ్ వీడియోపై మోడీ ఒకలా… మమత మరోలా రియాక్ట్ అయ్యారు.

ప్రధాని మోదీ ట్వీట్ :

- Advertisement -

సోషల్ మీడియాలో తన డ్యాన్స్ వీడియోపై స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ వీడియో చూసి మీరంతా ఎంజాయ్ చేసినట్లే ఆ డ్యాన్స్ చూసి తానూ ఎంజాయ్ చేసానని ప్రధాని అన్నారు. ఈ వీడియో చాలా సృజనాత్మకంగా వుందని ప్రధాని అన్నారు. ఎన్నికల హడావిడి సమయంలో ఇలాంటి వీడియోలు ఎంతో ఉపశమనంగా వుంటాయి… ఇలాంటివి తనకెంతో సంతోషాన్ని ఇస్తాయి అనేలా ప్రధాని కామెంట్స్ చేసారు. ఇలా తన డ్యాన్సింగ్ వీడియోను పోస్ట్ చేసిన నెటిజన్ ను, క్రియేట‌ర్ ను ప్రధాని మోదీ ప్రశంసించారు.

క్రియేట‌ర్ ను అరెస్ట్ చేయండి… దీదీ
ఈ డ్యాన్సింగ్ వీడియో దీదీ త‌న‌ను అవ‌మానించేలా ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.. ఈ వీడియో పోస్ట్ చేసిన‌, క్రియేట్ చేసిన వాళ్ల‌పై కేసు న‌మోదు చేసి ఆరెస్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు మమ‌తా బెన‌ర్జీ.. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ వీడియోను రూపొందించింది ఎవరో గుర్తించేపనిలో పడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement