Friday, November 22, 2024

Delhi: కువైట్ బాధితుల‌కు మోడీ అండ‌.. న‌ష్ట‌ప‌రిహారం ప్ర‌క‌టించిన ప్ర‌ధాని

ఉపాధి కోసం వెళితే ప్రాణాలు పోతాయి
కువైట్ లో భారీ అగ్ని ప్ర‌మాదం
43 మంది ఇండియ‌న్స్ స‌జీవ‌ద‌హ‌నం
మ‌రో 52 మందికి గాయాలు
ప్ర‌ధాని మోదీ దిగ్బ్రాంతి
బాధిత కుటుంబాల‌కు రూ.2 ల‌క్ష‌లు న‌ష్ట‌ప‌రిహారం
మృత‌దేహాల‌ను ఇండియాకు తీసుకురావాల‌ని ఆదేశం
విదేశాంగా శాఖ స‌హాయ మంత్రి కువైట్ ప‌య‌నం
క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్య సేవాలందించాల‌ని
కువైట్ లోని బార‌త అంబాసిడ‌ర్ కు పిలుపు

దక్షిణ కువైట్‌లోని విదేశీ కార్మికులు నివసిస్తున్న బహుళ అంతస్తుల భవనంలో నిన్న సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు 50 మంది మరణించారు. మరో 52 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 43 మంది భారతీయులే ఉన్నారు.
ఈ ప్రమాదం రాత్రి నిద్రపోతున్న సమయంలో పొగలు వ్యాపించడంతో ఊపిరాడక చాలా మంది మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ భవనంలో ఒకే కంపెనీకి చెందిన 195 మంది కార్మికులు నివసిస్తున్నట్లు సమాచారం. అగ్నిప్రమాదంలో మరణించిన వారి సంఖ్య నేటికి 50కి చేరుకుందని కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో నివేదించింది. ఇక, మృతుల్లో 11మంది కేరళకు చెందిన వారని, మిగిలిన వారు తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన వారు ఉన్నారు.

ప్ర‌ధాని మోదీ దిగ్భాంతి..

- Advertisement -

కువైట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన భారతీయ కార్మికుల కుటుంబాలకు భారత ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.2లక్షల సాయం ప్రకటించింది. ఈ సహాయాన్ని ప్రధానమంత్రి సహాయనిధి నుంచి అందజేస్తారు. ఇక కువైట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక నివాసం 7 లోక్‌కల్యాణ్ మార్గ్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ దురదృష్టకర సంఘటనపై ప్రధాని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలపడంతో పాటు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మోడీ ఆకాంక్షించారు.

ఇక, కువైట్ లోని భారతీయులకు అన్ని విధాలా సహాయాన్ని అందించాలని అక్క‌డ భార‌త అంబాసిడ‌ర్ ను ప్రధాని మోడీ ఆదేశించారు. సహాయ చర్యలను పర్యవేక్షించడంతో పాటు మృతదేహాలను త్వరగా భారత్ కు తిరిగి తీసుకురావడానికి విదేశాంగ శాఖ సహాయ మంత్రిని వెంటనే కువైట్‌కు వెళ్లాల్సిందిగా చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement