మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ మంత్రి సత్యేందర్ కుమార్ జైన్ అస్వస్థతకు గురయ్యారు. జ్యుడీషిల్ కస్టడీలో ఉన్న సత్యేందర్ జైన్‌కు సోమవారం ఆక్సిజన్ లెవల్స్ తగ్గాయి. దీంతో ఆయనను లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సత్యేందర్ జైన్, కోల్‌కతాకు చెందిన షెల్ కంపెనీల ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మే 30న ఆయనను అరెస్ట్ చేసి… కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన తరువాత ఈ నెల 13న కోర్టు 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.