ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ సింగ్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. మనీలాండరింగ్ కేసులో అరెస్టై జైలుపాలైన సంజయ్ సింగ్‌కు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుకు సంబంధించిన సంజయ్ సింగ్ పై ఎలాంటి ఆంక్షలు విధించొద్దని సుప్రీంకోర్టు సూచించింది. అలాగే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అతను ఎక్కడైనా పాల్గొనే అవకాశం ఉందని.. దానికి ఆయనకు పూర్తి స్వేచ్చ ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది.
లిక్కర్ స్కాం కేసులో మనీలాండరింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయిన సంజయ్ సింగ్.. 6 నెలల పాటు జైల్లో ఉన్నారు. కాగా తనకు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించగా విచారణ అనంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. అలాగే తెలంగాణ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత కూడా ప్రస్తుతం ఈ కేసులోనే రిమాండ్ కస్టడీలో ఉన్నారు.