Thursday, January 30, 2025

Delhi | ‘వక్ఫ్‌ సవరణ బిల్లు’ కు జేపీసీ ఆమోద ముద్ర

న్యూ ఢిల్లీ – వక్ఫ్‌ బోర్డ్‌ అధికారాలకు కోత పెడుతూ మోదీ సర్కార్‌ తీసుకొచ్చిన ‘వక్ఫ్‌ సవరణ బిల్లు’కు ఆమోదం లభించింది. ఈ బిల్లు పరిశీలన కోసం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ సంయుక్త కమిటీ ఇవాళ సమావేశమైన పలు ప్రతిపాదనలతో బిల్లుకు ఆమోదం తెలిపింది. అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సభ్యులు ప్రతిపాదించిన మొత్తం 14 సవరణలను జేపీసీ ఆమోదించింది. విపక్షాలు సూచించిన మార్పులు తిరస్కరణకు గురయ్యాయి.

కాగా, వక్ఫ్‌ సవరణ బిల్లుకు పరిశీలన కోసం ఏర్పాటు చేసిన ప్యానెల్‌కు బీజేపీ ఎంపీ జగదాంబి పాల్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆయన సమక్షంలో జేపీసీ కమిటీ ఇవాళ సమావేశమైంది. విపక్ష ఎంపీలు సహా ఇతరులు మొత్తంగా 44 మార్పులు సూచించగా.. 14 సవరణలను కమిటీ ఆమోదించినట్లు ప్యానెల్‌ ఛైర్మన్‌ జగదాంబిక పాల్‌ వెల్లడించారు. ఈ సవరణలు చట్టాన్ని మరింత శక్తివంతంగా మారుస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఈ 14 ప్రతిపాదనల ఆమోదానికి సంబంధించి జనవరి 29న ఓటింగ్‌ జరగనుంది. జనవరి 31న తుది నివేదిక లోక్‌సభకు అందజేయనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement