Friday, November 22, 2024

Delhiకి చేరిన జీవ‌న్ రెడ్డి అల‌క‌… హ‌స్తినకు తక్షణం రావాలని అధిష్టానం పిలుపు

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో తీవ్ర మనస్తాపానికి గరైన జీవన్ రెడ్డి రాజీనామా చేస్తారనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే వెంట‌నే డిప్యూటీ ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రి దుద్ద‌ళ్లి శ్రీధ‌ర్ బాబు లు జీవ‌న్ ఇంటికి వెళ్లి ఆయ‌న‌ను బుజ్జ‌గించారు.. దీంతో ఆయ‌న చ‌ల్ల బ‌డ్డారు.. ఈ నేప‌థ్యంలోనే తాజాగా జీవన్ రెడ్డి ఎపిసోడ్ ఢిల్లీకి చేరుకుంది. ఈ రోజు ఉదయం ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపా దాస్ జీవన్ రెడ్డికి ప్రత్యేకంగా ఫోన్ చేసి మాట్లాడారు. వెంటనే ఢిల్లీకి రావాలని ఆదేశించారు. దీంతో ఢిల్లీలో ఉన్న దీపాదాస్ మున్షీని కలిసేందుకు జీవన్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీకి బ‌య‌లు దేరారు..జీవ‌న్ రెడ్డి ని ఢిల్లీకి పంపించే బాద్య‌త‌ల‌ను ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కు అప్పగిస్తూ ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ ఆదేశాలు ఇచ్చారు.

మరోవైపు నేడు ఢిల్లీకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు వెళ్లనున్నారు. మంత్రివర్గ విస్తరణ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు, ప్రధానంగా జీవన్ రెడ్డి విషయంలో అధిష్టానంతో చర్చించనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, జూపల్లి ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement