Saturday, November 23, 2024

రేపే ఢిల్లి-జైపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ వే ప్రారంభం..

ఢిల్లి-ముంబై మధ్య ఎక్స్‌ప్రెస్‌ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదివారం ప్రారంభించనున్నారు. ఈ మార్గం వల్ల ఢిల్లి-జైపూర్‌ మధ్య ప్రయాణకాలం ఐదుగంటల నుంచి మూడున్నర గంటలకు తగ్గుతుంది.1,386 కిలోమీటర్ల నిడివి గల ఈ మార్గాన్ని 12,150 కోట్ల రూపాయిలతో నిర్మించారు. ఢిల్లి-ముంబై మధ్య ప్రయాణ దూరం 180 కిలో మీటర్లు తగ్గుతుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌ వే ఆరు రాష్ట్రాల మీదుగా వెళ్తుందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు.

ఢిల్లి, హర్యానా, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్రల మీదుగా వెళ్తుంది. ప్రధాన నగరాలైన కోట, జైపూర్‌, భోపాల్‌, వడోదర, సూరత్‌ల మీదుగా ఈ రహదారి కనెక్ట్‌ అవుతుంది.ఎంతో కాలంగావేచి చూస్తున్న ఈ రహదారి వల్ల ఈ రాష్ట్రాల వారికి ఎంతో మేలు జరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement