ఢిల్లీ నుంచి దేహ్రాదూన్ బయలుదేరిన ఇండిగో విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం అత్యవసరంగా ఢిల్లీలోనే ల్యాండింగ్ అయ్యింది. సురక్షితంగా ల్యాండింగ్ కావడంతో అందులోని ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, సాంకేతిక లోపం కారణంగానే ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యిందని పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఢిల్లీ నుంచి దేహ్రాదూన్ బయలుదేరిన ఇండిగో విమానం 6ఈ2134, సాంకేతిక కారణంతో బయలుదేరిన చోటుకే తిరిగి వచ్చింది. సమస్యను గుర్తించిన వెంటనే ఈ విషయాన్ని పైలట్ ఏటీసీకి తెలియజేసి అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. దాంతో విమానం ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. తదుపరి పరీక్షల అనంతరం తిరిగి ప్రయాణానికి సిద్ధమవుతుంది’ అని ఇండిగో తాజా ప్రకటనలో పేర్కొంది.